ఆ బండిలో
అందరికీ బెర్తులు ఫ్రీనే
ముందే..మీరడక్కుండానే
రిజర్వు అయిపోతాయి
ఎవరికివారు చేసుకోనక్కరలేని
రిజర్వేషను ఇదొక్కటే
అప్పుడప్పుడు తత్కాల్ ఆఫర్
కూడా వుంటుంది
బెర్తులు బానే ఉంటాయండోయ్
ఎంచక్కా పూలుచల్లబడి
అత్తరు పూయబడి
అగరొత్తుల పరిమళమద్దబడి
ఆ మాత్రం సోకు ఉండొద్దూ
బండిపేరు
మరణం మరి!
సృజనాత్మకత ఎక్కడుంటే అక్కడుంటాను ఆస్వాదించడానికైనా అందులో భాగమవ్వడానికైనా. ఐదు పదుల వయసుకి దగ్గరవుతున్నా 'ఎదుగుతున్న' ఘజల్ గాయనిని, కవియిత్రిని, చిత్రకారిణిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడను..నేర్చుకోవడానికి ఒక జీవితం చాలదనిపిస్తుంది