సహజీవనం
ఒకరిలో ఒకరు
ఒదిగిపోయి
దగ్గరగా.. మరింత దగ్గరగా..
దాహాలు తీరేదాకా
ఆర్తిగా అల్లుకుపోయి
మోహాలు కరిగేదాకా
పూర్తిగా కొట్టుకుపోయి
తీరం చేరిన దేహాలు..
ప్రణయసంగమం కాదది
కలిసి విడివిడిగా తీర్చుకుంటున్న
అవసరం
మమకారం కాదది
ఒకరికొకరు చేసుకుంటున్న
ఉపకారం
అనుబంధం కాదది
ఒద్దంటే తెంచుకునే వీలున్న
ఒప్పందం
దాపత్యం కాదది
విద్యనేర్చిన వింతపశువులు చేస్తున్న
అనాగరికం
సహజీవనమట
జీవనమా అది?
అస్తవ్యస్త పయనం!
అపస్వరాల గానం !!
('లివింగ్ టుగెదర్ వితౌట్ మేరేజ్' కల్చర్ మనవాళ్ళకి కూడా వంటబడుతుండడం తెలిసి బాధతో.. )
2 comments:
అనుబంధం కాదది
ఒద్దంటే తెంచుకునే వీలున్న
ఒప్పందం
నిజమే! కొన్ని సాంప్రదాయాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నామేమో అనిపిస్తూ .... బాధగా ఉంటుంది. శుభోదయం జ్యోతిర్మయీ!
మంచి వ్యాఖ్య..ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు
Post a Comment