బ్లాగు మితృలందరికీ నమస్కారములు! ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నాకు వచ్చిన ఆలోచన భాషాభిమానం పేరిట అచ్చులతో చిత్రాలు గీసాను. శ్రీ అద్దేపల్లి రామ్మోహనరావు గారు రాసిన చక్కని తెలుగు పాటకు స్వరకల్పన చేసి పాడి ఈ చిత్రాలకు జతచేసి ఒక వీడియోగా చేసాను..ఈ నా చిన్ని ప్రయత్నముపై తమ అమూల్యమైన అభిప్రాయములను గ్రూపులోనూ యూట్యూబు లోనూ పోస్ట్ చేయగలరని ఆశిస్తున్నాను మీ జ్యోతిర్మయి మళ్ళ
పసిపాప మరణవాఞ్మూలం
ఇదిగో ఇక్కడెవరైనా ఉన్నారా? నేనెవరని అడుగుతున్నారా? నాకు ఊరూలేదు పేరూలేదు పట్టుమని పదిగంటల వయసూ లేదు ఇప్పుడే నన్నిక్కడెవరో పారేసి పోయారు..
గుడ్డల్ల్లేని నా వంటిని గుచ్చుతున్నాయి రాళ్ళూ ముళ్ళూ ఊపిరాడనివ్వడం లేదు నా కొనఊపిరిని పొదలే చూస్తున్నా చుట్టూ ఇంకెంతసేపో నిలవదు నా ప్రాణం రాసుకోండి ఇస్తున్నా మరణ వాఞ్మూలం
"ఆమె కష్టపడి కన్నది మమకారంతో కాదు అండంగానో పిండంగానో వదిలించుకొనే దారి దొరకక.. ఇక్కడివరకూ తెచ్చింది మానవత్వంతో కాదు పక్కనెక్కడా నా ఏడుపు వినపడనియ్యని చోటు కనపడక.."
ఓరి దేముడా! శ్వాస ఆగేవరకూ నాకు నోరివ్వు ఇస్తే అడుగుతా ఈ రాక్షస సమాజాన్ని విశృంఖలతను వెంబడించి పోయి ప్రేమపాశం గుడ్డిదైపోతున్నదా? కర్కశత్త్వపు బండెక్కి ఊరేగి వాత్సల్యం గడ్డకట్టిపోతున్నదా? స్వార్ధరక్కసి మంటల్లోపడి అమ్మతనం ఆవిరయ్యిపోతున్నదా?
సృజనాత్మకత ఎక్కడుంటే అక్కడుంటాను ఆస్వాదించడానికైనా అందులో భాగమవ్వడానికైనా. ఐదు పదుల వయసుకి దగ్గరవుతున్నా 'ఎదుగుతున్న' ఘజల్ గాయనిని, కవియిత్రిని, చిత్రకారిణిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడను..నేర్చుకోవడానికి ఒక జీవితం చాలదనిపిస్తుంది