వికృతికి వీడ్కోలు


వికృతీ వెళ్లిపోతున్నావా
పనైందికదాని పారిపోతున్నావా?


నువ్వెళ్లేటపుడు నీకేదైనా
చూపిద్దామనుకున్నా
ఏమున్నాయిక్కడ?
సునామీ ప్రళయానికి బలై
సుష్కించిన ప్రకృతి తప్ప!


నువ్వెళ్లేటపుడు నీకేదైనా
చెబుదామనుకున్నా
ఏమని చెప్పను?
గొంతుకోతకు గురై
ప్రాణాలు విడిచిన
అక్కచెళ్లెళ్ల దీన గాధలు తప్ప!


నువ్వెళ్లేటపుడు నీకేదైనా
వినిపిద్దామనుకున్నా
ఏముంది నీవు వినడానికి?
ఆకలి చావుకు గురై
అసువులు బాసిన
అన్నదాతల ఆత్మ ఘోషలు తప్ప!


నువ్వెళ్లేటపుడు నిన్నేదైనా
అడగాలనుకున్నా
ఏమిస్తావు నువ్వు మాత్రం?
"శ్రీఖర వస్తాడు
అడిగి తీసుకో" అని అనడం తప్ప!





0 comments:

Post a Comment