అత్మ వంచన


లంచం..లంచం
ఇదిలేని చోటే లేదీ రాజ్యంలో
లంచం ఇవ్వడమోతీసుకోవడమో 
లేకుంటే రోజే గడవదీ దేశంలో
ఆసుపత్రిలో ఆఫీసుల్లో
ఆలయాల్లో విద్యాలయాల్లో
ఎక్కడ చూసినా..
అడుగు వేయాలన్నా
వేసిన అడుగు తీయాలన్నా..
లంచమే..


అంతెందుకు?
'అన్నం తినరా' అంటే
'నాకేంటి?' అంట్టున్నాడు అబ్బాయి
పరీక్షలకు చదవవే అంటే
'నాకేమిస్తావు?' అంటుంది అమ్మాయి
ఏదొ ఒకటి ఇస్తేతప్ప
పనిజరిగేలాలేదని
'సరే'ననడం...
మనింట్లోనే మనచేత్తోనే
ఈ విత్తనాన్ని నాటి
పచ్చగా పెరిగేలా చేసి
పోషిస్తున్నది మనం కాదూ!


ఆ మొక్కే మహావృక్షమై
పకలించలేనంతగా
పాతుకుపోవడానికి 
కారకులం మనం కాదూ!


ఎవరికి వారు ఎదుటివారిని
వేలెత్తి చూపుతూ
చేసిందంతా చేస్తూ
'మనదేం తప్పులేదని'
సమర్ధించుకుంటూ
అడుగడుగునా ఆత్మవంచన 
చేసుకుంటున్నది మనం కాదూ!


ఈ మహమ్మారిని హతమార్చడానికి
ఎవరో కాదు..నువ్వూ నేనూ..మనందరం
నోటితో కాదు..
మనసుతో చెయ్యాలి ప్రమాణం!
గొంతుతో కాదు..
గుండెతో చెయ్యాలి నినాదం!!











2 comments:

కెక్యూబ్ వర్మ

సత్యం...

జ్యోతిర్మయి ప్రభాకర్

థాంక్యూ వర్మ తమ్ముడూ

Post a Comment