తిరిగిరాని ప్రయాణం


కాలం సాగిపోతోంది
కాదు కాదు పరిగెడుతోంది
రైలు బండి స్పీడులో దూసుకెళుతోంది
ఎక్కడికి ప్రయాణం? ఏమో!
గమ్యం తెలీని ప్రయాణం

వెనక్కి వెళ్తున్నవేమీ మళ్లీ రావా?
అలక్ష్యంతో అందుకోని ఆత్మీయులు
వెనక్కి వెళ్లిపోయిన దృశ్యాల్లా
నిర్లక్ష్యంతో వదిలేసిన బంధాలు
మళ్లీ తిరిగిరాని స్టేషన్లలా..
అనిపిస్తున్నాయి ఇప్పుడు

గమ్యం చేరాక తిరిగి ఇంకోసారి
ఈ బండి వెనక్కి వెళితే బాగుణ్ణు
ఈసారి శ్రధ్ధగా.. బుధ్ధిగా..
జాగ్రత్తగా..జాగరూకతగా
ఇష్టంగా..అర్ధవంతంగా..
వళ్లు దగ్గరపెట్టుకుని కళ్లింత చేసుకుని
ప్రయాణం మళ్లీ మొదలెడతా
!

2 comments:

కెక్యూబ్ వర్మ

ప్రయాణాన్ని జీవన యానాన్ని కలగలిపి కవిత్వీకరించిన మీకు అభినందనలక్కా...

జ్యోతిర్మయి ప్రభాకర్

థాంక్యూ తమ్ముడూ

Post a Comment