అన్నీ జ్ఙాపకమే...ప్రియా!
నా నడకల కదలికల చిరు సవ్వడులు
నీ చెవిని సన్నగా చేరినప్పుడు
ఎక్కడనీవెక్కడని నాకై నీ కన్నులు పరికించడం..
నా హృదయ స్పందనల తరంగ వీచికలు
నీ మదిని మెత్తగా తాకినప్పుడు
గుండెచప్పుడాపి పరిపరి నీ మనసు పరితపించడం..
నా తొలితొలి వలపుల తొలకరి జల్లులు
నీ మోవిపై చల్లగా కురిసినప్పుడు
సమ్మోహితమై తడిసిన నీ పెదవులు కంపించడం..
నా మల్లియ సొగసుల పరిమళ గంధాలు
నీ ఎడదపై మృదువుగా పూసినప్పుడు
పరవశభరితమై తన్మయ నీ తనువు పులకించడం..
అన్నీ..నాకింకా జ్ఙాపకమే!
నా నడకల కదలికల చిరు సవ్వడులు
నీ చెవిని సన్నగా చేరినప్పుడు
ఎక్కడనీవెక్కడని నాకై నీ కన్నులు పరికించడం..
నా హృదయ స్పందనల తరంగ వీచికలు
నీ మదిని మెత్తగా తాకినప్పుడు
గుండెచప్పుడాపి పరిపరి నీ మనసు పరితపించడం..
నా తొలితొలి వలపుల తొలకరి జల్లులు
నీ మోవిపై చల్లగా కురిసినప్పుడు
సమ్మోహితమై తడిసిన నీ పెదవులు కంపించడం..
నా మల్లియ సొగసుల పరిమళ గంధాలు
నీ ఎడదపై మృదువుగా పూసినప్పుడు
పరవశభరితమై తన్మయ నీ తనువు పులకించడం..
అన్నీ..నాకింకా జ్ఙాపకమే!
2 comments:
SSSuper jyothi garu!
కవిత నచ్చినందని చెప్పినందుకు చాలా థాంక్స్ సత్యా
Post a Comment