నాన్నెప్పుడూ నాతోడే
































లోకంలోని నాన్నలంతా ఒకెత్తు
నాకు మా నాన్నొక్కరే ఒకెత్తు 

ఈ అక్షరాలు నాకాయనిచ్చినవి
నా లక్షణాలు ఆయన్నించొచ్చినవి
సుతిమెత్తిని హృదయమాతని సొంతం
చీమకైనా ఎలాంటి హానీ చేయలేరు

మృదువైన భాషణ అతనికాభరణ
పొరపాటునైన పరుషములాడెరుగరు

సూక్ష్మమైన జ్ఙానమాతని సొత్తు
విషయమేదైనా విడమర్చి చెప్పగలరు

మంచులాంటి మనసాతని ఆస్తి
కలనైనా కష్టమెవరికి కలగనీరు

నా ఉత్సాహానికి ప్రోత్సాహమై
నా ప్రతిభలకు పునాదై
నా ప్రతిపనికీ ప్రేరణయై
నా అశయాలకు ఆలంబనై
అన్నిటా తోడై నడిపించారు

కనిపించని లోకాలనున్నా
నాక్కనిపిస్తూనే ఉన్నారు
నా ఆలోచనలలో నిండి.
ఆచరణలలో నాతోడుండి
అప్పుడూ..ఇప్పుడూ..ఎప్పుడూ

నాతోడే మా నాన్నెప్పుడూ !

4 comments:

Uday Kumar

akaa చాలా బాగుంది. మరపురాని జ్ణాపకాలు మన జీవితగతులను స్థిరపరచాలి, నిర్దేశించాలి. మనమేమిటని నిరూపించాలి. అదే మన నివాళి.

జ్యోతిర్మయి ప్రభాకర్

నువ్వు చెప్పింది అక్షరాలా నిజం ఉదయ్, చాలా థాంక్స్

నేను మీ నేస్తాన్ని

maa nanna gurtuku vachaadu andi..... tanu unnapudu tana viluva teliyaledu naaku appudu...

జ్యోతిర్మయి ప్రభాకర్

చాలా థాంక్స్ అండి..ఈ కవిత ద్వారా మీ నాన్నను గుర్తు చెయ్యగలిగినందుకు సంతోషం!

Post a Comment