రాయబారి
నాకు తానూ
తనకి నేనూ
నీకన్నా దూరం..
ఇలా
మా ఇద్దరికీ కనిపిస్తూ
అలా
వెన్నెల నవ్వులు కురిపిస్తూ
మాపై నువ్వు చల్లేది
చల్లదనమని అనుకోకు
మాలో
తాపాగ్నిని రేపిన పాపానికి
ప్రాయశ్చిత్తం..
నువ్వు మాకు రాయబారి అవడమే
ఈ కంటి చూపు ఆ కంటి దాకా
ఆ గుండె బాధ ఈ గుండె దాకా
చేర్చి కూర్చే బాధ్యత నీదే !
2 comments:
నాకు తానూ, తనకి నేనూ
నీకన్నా దూరం ....
నువ్వు మాపై చల్లేది చల్లదనమని అనుకోకు
తాపాగ్నిని రేపిన పాపానికి ప్రాయశ్చిత్తం .... నువ్వు రాయబారి అవడమే
ఈ చూపు ఆ దాకా ఆ గుండె బాధ ఈ గుండె దాకా చేర్చి కూర్చే బాధ్యత నీదే ఓ చందమామా అన్నట్లు .... రాయబారం బాగుంది జ్యోతిర్మయీ! అభినందనలు.
ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు
Post a Comment