దృశ్యం 

నువుకనపడని నా ప్రపంచం శూన్యమనీ

నువు నిండి వున్న మనసు తప్ప

నాలో మిగిలిందంతా వ్యర్ధమనీ

నీకూ నాకూ మధ్య అవధులనంతమనీ

మరుజన్మ తప్ప నినుచేరే మార్గం

ఇపుడిక మరి లేదనీ

ఇన్నాళ్ళూ అనుకున్నా..

కానీ..

ఆనాటి దుఖంలో

గుండె అగ్నిపర్వతంలా మండి

ఆసెగలో

మది అద్దం పగిలి తునాతునకలై ఎగిరి

తనలోని నిన్ను

ప్రకృతిలోని ప్రతి అణువునా చేర్చిందని

నా చూపు పడిన ప్రతి చోటా..

మట్టిలో, మొక్కలో, వికసించే మొగ్గలో

గగనంలో, గాలిలో, వర్షించే మేఘంలో

రాళ్ళలో, రంగుల్లో, ఎగిరే విహంగంలో

చంద్రుడిలో సూర్యుడిలో ఎదురయ్యే ప్రతిమనిషిలో

..పరావర్తనమై

నాక్కనిపిస్తున్నది నువ్వేనని

ఇన్నాళ్ళకు తెలుసుకున్నా!

2 comments:

vemulachandra

" మట్టిలో, మొక్కలో, వికసించే మొగ్గలో .... గగనంలో, గాలిలో, వర్షించే మేఘంలో .... రాళ్ళలో, రంగుల్లో, ఎగిరే విహంగంలో
చంద్రుడిలో, ఆ సూర్యుడిలో ఎదురయ్యే ప్రతిమనిషిలో .... పరావర్తనం చెంది నాక్కనిపిస్తున్నది నువ్వే అని ఇన్నాళ్ళకు తెలుసుకున్నా!"

వరద లా ఉప్పెనలా భావ ప్రవాహం
కొట్టుకుపోతానేమో అని
అభినందనలు జ్యోతిర్మయీ!

జ్యోతిర్మయి ప్రభాకర్

thanks chandra ji

Post a Comment