రియల్ ఫీస్టు
ఏమండోయ్
ఇవాళ మీకోసమొక సరికొత్త విందు
ఇదిగో పళ్ళెం నిండా వేడివేడి కవిత
అందుబాటుగా అధరువులివిగో
హల్వాలాంటి హైకూ, రుచికరమైన రూబయీ
కలుపుకోడానికి నానీ..ఇక లాగించండి
అదేమిటలా పెదవి విరిచేస్తున్నారు?
ఆగండాగండి..
ఫ్లేవరు సరిపోలేదా, ఓరెండు
ఫెంటోలు తగిలిస్తాగా! కూర్చోండి
ఇదిగో మీరడగకపోయినా
ఘుమఘుమలాడే ఘజలొకటి మీకు స్పెషల్
మొహమేమిటలా పెట్టేరు?
నంజుకోడానికోనాలుగు
నానోలు వడ్డిస్తాలెండి
ఇంకేం కావాలండీ? ఓహో
గార్నిషింగ్ మిస్సింగా?
ఇదో..పైన జల్లుతున్నాగా
కరకరలాడేందుకు కార్టూన్లు!
భలేవారే, అలా అసంతృప్తిగా వెళ్ళిపోతారేం?
పోతే పోయేరు ఏదైనా చెప్పిపొండి
చెప్పేంతగా ఏమీ లేదంటారా?
అంతా ఆరగించేసి
అలా లోలోపలే బ్రేవ్ మనిపించేసుకోక
ఒక్క లైకైనా కొట్టిపోవచ్చుగా!
ఆగి..వెనుతిరిగారు శ్రీవారు!!
ఆశగా చూసా..
"చూడూ, కావాలంటే..
నీ ఫేసు చూపించు ఎంతసేపైనా చూస్తా
నీ ఫేస్బుక్కు మాత్రం ఇంకెప్పుడూ చూపించకు"
ఆశగా చూసా..
"చూడూ, కావాలంటే..
నీ ఫేసు చూపించు ఎంతసేపైనా చూస్తా
నీ ఫేస్బుక్కు మాత్రం ఇంకెప్పుడూ చూపించకు"
2 comments:
సరికొత్త విందు, వేడివేడి కవిత .... హల్వాలాంటి హైకూ, రుచికరమైన రూబయీ
.... ఫ్లేవరు సరిపోలేదా, ఓరెండు ఫెంటోలు తగిలిస్తా! కూర్చోండి
ఘుమఘుమలాడే ఘజలొకటి .... స్పెషల్
నానోలు వడ్డిస్తాలెండి .... కరకరలాడేందుకు కార్టూన్లు!
.... అన్యాయం జ్యోతిర్మయీ సౌతాఫ్రికాలో కూర్చుని ఎవరూ రారనేగా క్లుప్తంగా ముగించేస్తున్నావు విందు. చదివితేనే ఇంత ఆహ్లాదమైతే తింటే ఇంకెంత మాధుర్యమో .... మిస్సయ్యాము నిన్ను.
అభినందనలు మీకూ మీ శ్రీవారికి.
ప్రపంచంలో ఏమూలనున్నా ఆరగించే విధమైన విందు కదా ఈ అంతర్జాల కవిత్వం! అభిమానానికి ధన్యవాదాలు చంద్రా గారు
Post a Comment