జానపదగీతం

ఎంత మంచోడో నామావా
ఎంతమంచోడో నామావా
బంగారిమావా సింగారిమావా
ముత్యాలమావా నాముద్దులమావా //ఎంత//

ఏటికాడ నన్నుసూసి కన్ను కొట్టాడే

ఏరుదాటే సరికి మనసు కొల్లగొట్టాడే
ఇరుగమ్మా పొరుగమ్మల కన్నుకుట్టేలోగానే
మంచిరోజు
సూసి నాకు తాళికట్టాడే

ఎన్నంటిమావా కన్నంటిమావా
జున్నంటిమావా నాముద్దులమావా //ఎంత//

పువ్వులాగ గువ్వలాగ సూసుకున్నాడే
పుండుపడక ఎండపడక కాసుకున్నాడే
రాసంటే నాదేనని కుల్లుకున్నారూరోల్లు
కాలు కందనీయకుండ ఏలుకున్నాడే

సరదాలమావా సరసాలమావా
మురిపాలమావా నాముద్దులమావా //ఎంత//

మచ్చుకొక్క మాటైనా కచ్చి ఎరగ
డే
మెచ్చుకోని సోటైనా గుచ్చి అడగడే
గంగమ్మా గైరమ్మా అమ్మలు మీరే ఆడికండ
ఆడెప్పుడు మీనీడన సల్లగుండాలే

 
ల్లంటిమావా జల్లంటిమావా
మల్లంటిమావా నాముద్దులమావా //ఎంత//

0 comments:

Post a Comment