తాజాస్మృతి

చచ్చిబతుకుతుంటాను నేను
నీరూపం..
వచ్చి వచ్చి నా కలవాకిలి తట్టి వెళ్ళినపుడల్లా

ఒక్కడుగు వెనక్కి వేస్తే అయ్యావు
నువ్వు మాయం..
అక్కడ్నించెన్నడుగులు ముందుకేసినా
మళ్ళీ కనపడలేదు అదేమి చోద్యం?

పచ్చిపుండవుతుంటుంది 
నా హృదయం..
గుచ్చి గుచ్చి జ్ఞాపకాల్ని తవ్వినపుడల్లా

తడిసిన నా పెదవులు నిన్నెంత కవ్వించాయో
ఆరహస్యం..
బట్టబయలు చేసింది మరుక్షణమే
తమకంతో నీ అధరద్వయం!

పిచ్చిదాన్నవుతుంటాను నేను
మన ప్రేమకుసుమం..
విచ్చివిచ్చి నాయెదతోటలో పూసినప్ప్పుడల్లా

మరుపు సహజమని ఎవరన్నారు?
అంతా అబధ్ధం..
ప్రత్యామ్నాయ ప్రవాహంలో ఎన్నిసార్లు పడిలేచినా
తాజాగా నామదినిండా మళ్ళీ నువ్వే సిధ్ధం!

0 comments:

Post a Comment