మరులు రేపు హృదయడోలలు పెదవిదాటక ఆగిపోవగ
హాయిగొలుపు గిలిగింతలు పైకి తెలుపక ఆగిపోవగ
ఈ మౌనమెంత బాగుందో!
ప్రేమపలుకుల తేనెరాగాలు క్షణమైనను మరువక తలపించగ
వలపుతలపుల సుస్వరనాదాలు ఒకటైనను వదలక వినిపించగ
ఈ నిశ్శబ్దమెంత బాగుందో!
ఊహలల్లిన ప్రణయసీమల ప్రతిక్షణమూ నాదవ్వగ
గుండెగుడిలో పదిలమైనీవు అనుక్షణమూ తోడుండగ
ఈ ఏకాంతమెంత బాగుందో!
4 comments:
ఊహలల్లిన ప్రణయసీమల ప్రతిక్షణమూ నాదవ్వగ
గుండెగుడిలో పదిలమైనీవు...
చాలా బావుందండీ...
జ్యోతిర్మయి గారూ చాలా థాంక్స్..నా పేరుతో ఉన్న వ్యక్తిని కలవడం కొంత థ్రిల్ల్ ను కలిగించింది
Silence is Golden. Silence is Subtle. It is the true nature of inner Being. It is Bliss. Very nicely written but commented on my own way.
Thanks a lot Narendra garu
Post a Comment