భారతదేవీ వందనం ఓ..
బంగరు భూమీ వందనం
ఏడు స్వరములు పాటగ మారగా
కోటి స్వరముల కీర్తనం /భారత/
నీ శుభగానం పాడెదమూ
నిరతము నిన్నే కొలిచెదమూ
ప్రతి ఒక ఫౌరునీ మానసమందిరం
నిండెను మంగళమౌ నీ రూపం /భారత/
కాలం వెనుకే పరుగెడుతూ
సతతము మాకై శ్రమపడుతూ
అలసిన సొలసిన నిను సేవించే
అమ్మా మాకొక వరమివ్వు /భారత/
కలతల కాలం ముగిసింది
కమ్మని తరుణం ముందుంది
ప్రతి భారతీయుడూ కార్మిక యోధుడై
నిలుపును జగతిలో నీ ప్రగతి /భారత/
0 comments:
Post a Comment