నిక్షిప్త ప్రేమనిధి



నా హృదయాంతరంగాన నిక్ష్ప్తప్త మైయున్న 


ప్రేమ నిధికి పెన్నిధివి నువ్వే



నా మానసమందిరాన నిద్రాణమైయున్న 
ప్రణయ సీమకు అధిపతివి నువ్వే 

నా మనసంతా నువ్వే
నా అణువణువూ నీకే


అని నీతో అనాలనుంది
గొంతెత్తి గట్టిగా అరవాలనుంది


ఏదీ ఏ శబ్దం బయటికి రాదేం?
గుండె లోంచి ఉబికివచ్చి గొంతులోనే ఆగిపోయిందేం?


గొంతు నిండా బాధ నింపి వెనక్కి మళ్లీ
లోలోపలి మనసు పొరల్లోకి వెళ్లిపోయిందా?


   

2 comments:

veera murthy (satya)

మీ రాతల్లో లాగానే చిత్రాల్లో కూడా మంచి భావుకత వుంది... :)

జ్యోతిర్మయి ప్రభాకర్

థాంక్యూ సత్యా!

Post a Comment