skip to main |
skip to sidebar
ప్రేమ ప్రేమంటారు
ప్రేమిస్తే తప్పేమిటంటారు
గొంతుదాక మునిగాక
ఆకలుండదు దాహముండదంటారు
ఎక్కువైతే ఊపిరాడదు
తక్కువైతే ఉండబట్టదు
లోతులన్ని తెలిసేదాక
నిలువనీయదు నిదురపట్టదు
ప్రేమే లోకమంటారు
ప్రేమలేక శూన్యమంటారు
కోరినంత దొరికాక
ఇదేనా ఇంతేనా అంటారు
2 comments:
అక్కా బాగుంది...కానీ ప్రేమకు ఇంతేనా అన్నది వుండదని నా భావన..అంతులేని తత్వం ప్రేమ..
"కోరినంత దొరికాక" అన్నాను అందుకే, "ఇదేనా ఇంతేనా" అనిపించడం లో దోషం కోరుకున్నవారిదే! ప్రేమ అపరిమితం..అది కోరుకున్నవారికి కోరుకున్నంత ..థాంక్స్ తమ్ముడూ !
Post a Comment