ప్రేమతత్వం
















ప్రేమ ప్రేమంటారు
ప్రేమిస్తే తప్పేమిటంటారు 
గొంతుదాక మునిగాక
ఆకలుండదు దాహముండదంటారు 


ఎక్కువైతే ఊపిరాడదు
తక్కువైతే ఉండబట్టదు
లోతులన్ని తెలిసేదాక 
నిలువనీయదు నిదురపట్టదు 


ప్రేమే లోకమంటారు
ప్రేమలేక శూన్యమంటారు
కోరినంత దొరికాక
ఇదేనా ఇంతేనా అంటారు