సహజానందం
ఇంట్లో అంతా సినిమాకెళ్లారు
ఎప్పుడో తారలాడిన ఆటను
తెరమీద బొమ్మలుగా చూడ్డానికి.
ఇంట్లో ఎందుకని తోటలోకి మార్చా వాలుకుర్చీని.
పువ్వుపువ్వునీ ముచ్చటగా పలకరిస్తూ
రెక్కలను పొందిగ్గా కదిలిస్తూ
నాట్యం చేసె సీతాకోకచిలకలూ
ఆ చెట్టుకు ఈ చెట్టుకు వంతెన వేస్తూ
ఘుమ్మని రాగాలు తీస్తూ
ఆక్కడొక కాలూ ఇక్కడొక కాలూ
వేస్తూ తిరిగే గండుతుమ్మెదలూ
అపుడపుడూ నిర్భయంగా పరిగెత్తుకొచ్చి వాలి
ఏదోటి ముక్కున దక్కించుకున్నాక
భయంగా తుర్రున పారిపోయే జంటపిట్టలూ
నాకు చూపించాయి ఓ అద్భుతమైన సినిమా
ఆహ్లాదకరమైన, సహజమైన సినిమా !
4 comments:
జీఎవితం ఒక సినిమా అన్నది చక్కగా వివరించారు జ్యొతి గారూ, ధన్యవాదములు.
Thanks andi Kavi Kalidasu garu
జ్యోతిర్మయి గారూ..చక్కని సినిమా చూపించారు.
సత్య గారు నా పేరు చూసి మీరనుకుని పొరపాటు పడ్డారట. ఆవిడిచ్చిన లింక్ పట్టుకుని వచ్చాను. చక్కని కవిత్వం చదవాను. ధన్యవాదాలు.
ఓహ్, ఒక్కోసారి పొరపాట్లు కూడా మేలుచేస్తాయనడానికి ఉదాహరణ.. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు
Post a Comment